ఆస్పత్రిలో స్పృహలేని భార్యను పొడిచి చంపిన భర్త.. తమిళనాడులో షాకింగ్ ఘటన

by Phanindra |

ఆస్పత్రిలో స్పృహలేని భార్యను పొడిచి చంపిన భర్త.. తమిళనాడులో షాకింగ్ ఘటన

ఆస్పత్రిలో స్పృహలేని భార్యను పొడిచి చంపిన భర్త.. తమిళనాడులో షాకింగ్ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 27 ఏళ్ల యువతిని భర్తే దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లాలో వెలుగు చూసింది. శ్రుతి, విశృత్ దంపతుల మధ్య శనివారం తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శ్రుతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం భార్యను చూసేందుకు వచ్చినట్లు ఆస్పత్రికి వచ్చిన విశృత్.. స్పృహలో లేని ఆమెను మూడుసార్లు కత్తితో దారుణంగా పొడిచి పారిపోయారు. ఈ ఘటన చూసిన ఆస్పత్రి సిబ్బంది, ఇతర పేషెంట్లు, వారి కుటుంబాలు విస్తుపోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కులిథలాయ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, విశృత్ కోసం వెతుకుతున్నామని చెప్పారు.

Next Story