Viral : నువ్వు దేవుడిలా వచ్చావు సామీ! 13 అంతస్తుల భవనం.. జారిప‌డ్డ చిన్నారి సేఫ్!

by Ramesh Naini |

మ‌హారాష్ట్రలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. థానేలో రెండేళ్ల చిన్నారి భవనం బాల్కనీ నుంచి జారిపడి ప్రాణాలతో బయపడింది.

Viral : నువ్వు దేవుడిలా వచ్చావు సామీ! 13 అంతస్తుల భవనం.. జారిప‌డ్డ చిన్నారి సేఫ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మ‌హారాష్ట్ర (Maharashtra)లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. (Thane) థానేలో రెండేళ్ల చిన్నారి మూడంతస్తుల భవనం బాల్కనీ నుంచి జారిపడి ప్రాణాలతో బయపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం (Dombivli) డోంబివిలీలో ఓ 13 అంతస్తుల భవనంలోని మూడవ అంతస్తు బాల్కనీలో రెండేళ్ల‌ బాలుడు ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పడిపోయింది. పాప కిందపడుతుండటాన్ని గమనించిన స్థానికుడు భవేష్ అనే వ్యక్తి వెంటనే పరుగెత్తుకెళ్ళి చిన్నారిని చేతులతో క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. దీంతో స్వల్ప గాయాలతో చిన్నారి ప్రాణాలతో బయట పడింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రమాదతీవ్రతను తగ్గించి.. రెండేళ్ల పాప ప్రాణాలను కాపాడిన వ్యక్తి భవేశ్‌‌పై స్థానికులు ప్రశంసల జల్లు కురింపించారు. పాపను రక్షించడానికి సమయానికి వచ్చిన దేవుడివి సామీ నువ్వు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story