- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UP : పొరుగింటి వారితో భూవివాదం.. కుమార్తెను హత్య చేసిన తండ్రి
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్(UP)లోని కుశినగర్(Kushinagar) జిల్లాలో అమానుషం జరిగింది. స్వయంగా తండ్రే తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసి.. ఆ పాపాన్ని పొరుగింటి వారిపై మోపేందుకు యత్నించాడు.

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్(UP)లోని కుశినగర్(Kushinagar) జిల్లాలో అమానుషం జరిగింది. స్వయంగా తండ్రే తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసి.. ఆ పాపాన్ని పొరుగింటి వారిపై మోపేందుకు యత్నించాడు. భూవివాదం నేపథ్యంలో పొరుగింటి వారిపై కేసు పెట్టేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో అతగాడు అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. జైనారాయణ్ సింగ్‌కు నలుగురు పిల్లలు. చిన్న కుమార్తె వయసు 16 ఏళ్లు. ఆమె పదోతరగతి చదువుతోంది. జైనారాయణ్‌కు కుశినగర్ జిల్లాలో రెండు ఇళ్లు ఉన్నాయి. నెబువా నౌరంగియా గ్రామంలో ఒక ఇల్లు, నౌకా తోలా గ్రామంలో మరో ఇల్లు ఉన్నాయి. అయితే నవంబరు 1న నెబువా నౌరంగియా గ్రామంలోని ఇంట్లో జైనారాయణ్ ఫ్యామిలీ ఉంది. ఆరోజు రాత్రి టైంలో ముగ్గురు పిల్లలు, భార్య కలిసి ఛత్ పూజల కోసం గుడికి వెళ్లిపోయారు. ఇంట్లో చిన్న కుమార్తె, జైనారాయణ్ మాత్రమే మిగిలారు.
ఈ సమయంలోనే తన చిన్న కుమార్తెను జైనారాయణ్ మర్డర్ చేశాడు. అనంతరం డెడ్‌బాడీని తీసుకెళ్లి.. 18 కి.మీ దూరంలోని నౌకా తోలా గ్రామంలో ఉన్న ఇంట్లో వేశాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంతమంది దుండగులు నవంబరు 1న రాత్రి ఇంట్లోకి చొరబడి తన కుమార్తెను మర్డర్ చేశారని ఆరోపించాడు. జైనారాయణ్ తీరుపై అనుమానం రావడంతో.. అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కూతురిని మర్డర్ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. సుదీర్ఘకాలంగా ఆస్తి వివాదం నడుస్తున్నందు వల్లే పొరుగింటి వాళ్లపై ఆ హత్య కేసును బనాయించాలని యత్నించినట్లు చెప్పాడు. దీంతో జైనారాయణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.






