Viral: ధరాలీ వరదల్లో మృత్యుంజయుడు… బురదలో నుంచి సురక్షితంగా బయటకు

by Prasad Jukanti |   (  Updated:2025-08-06 07:38:51  IST  )

ధరాలీ వరదల్లో మృత్యుంజయుడు… బురదలో నుంచి సురక్షితంగా బయటకు

Viral: ధరాలీ వరదల్లో మృత్యుంజయుడు… బురదలో నుంచి సురక్షితంగా బయటకు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్ లోని (Uttarakhand) ఉత్తర కాశీ జిల్లాను జలప్రళయం ముంచెత్తింది. క్లౌడ్ బరెస్ట్ కావడంతో ఒక్కసారిగా వరద నీరు అల్లకల్లోలం సృష్టించింది. కొండలను చీల్చుకుంటూ చెట్టు, చేమ, బరదను కలుపుకుని దిగువన ఉన్న ధరాలీ (Dharali Floods) గ్రామంలో విధ్వంసం సృష్టించింది. క్షణాల్లో పెను విధ్వంసం సృష్టించిన ఈ వరద కారణంగా నలుగురు మృతి చెందగా 70 మందికిపైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ సైన్యాధికారితో పాటు 10 మంది జవాన్లు ఉన్నారు. ఎక్కడ చూసిన విధ్వంసమే కనిపిస్తున్న ధరాలీ వరదల్లో ఓ వ్యక్తి మాత్రం మృత్యుంజయుడిగా నిలిచాడు. ఈ ప్రళయం ధాటికి భారీగా ఆ ప్రాంతంలో బురద పేరుకుపోయింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి మాత్రం బురదలో నుంచి పడుతూ లేస్తూ సురక్షిత ప్రాంతానికి చేరుకోగలిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కాగా జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోగా రమేశ్ ఒక్కరే విమానం అగ్గికి ఆహుతి అవుతున్నా ఆ మంటల్లో నుంచి క్షేమంగా నడుచుకుంటూ బయటకు రాగలిగాడు. తాజాగా ధరాలి వరదల్లో నుంచి బయట పడిన వ్యక్తిని రమేశ్ తో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/dna/status/1952982637942874585

Next Story