- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking News : జర్మనీలో ఎంఎస్.. బెంగళూరులో బిక్షాటన
by Sathputhe Rajesh |
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివిన ఓ వ్యక్తి బెంగళూరులో బిక్షాటన చేయడం షాకింగ్‌గా మారింది.

X
దిశ, నేషనల్ బ్యూరో : జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివిన ఓ వ్యక్తి బెంగళూరులో బిక్షాటన చేయడం షాకింగ్‌గా మారింది. అక్కడే మైండ్ ట్రీ అనే సంస్థలో పనిచేసిన సదరు వ్యక్తి బెంగళూరులో తాజాగా బిక్షాటన చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్స్ వేదికగా ‘కర్నాటక పోర్ట్‌ఫొలియో’ ఈ వీడియోను షేర్ చేసింది. తల్లిదండ్రులు, గర్ల్ ఫ్రెండ్‌ను కోల్పోవడంతో సైకలాజికల్ ట్రామాతో వ్యక్తి బాధపడుతున్నట్లు తెలిసింది. వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ..‘2013లో ఫ్రాంక్ ఫర్ట్‌లో చదివాను. తర్వాత బెంగళూరు వచ్చాను. గ్లోబల్ విలేజ్‌లో పనిచేశాను. తర్వాత నా తల్లిదండ్రులను కోల్పోయాను.’ అని తెలిపాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు వ్యూస్ పెరగడంతో పాటు వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘ప్లీజ్ అతని ట్రీట్‌మెంట్‌కు సాయం చేయండి.’ అంటూ కోరుతున్నారు.
Next Story






