- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జల్లికట్టు ఎద్దును అమ్మేయాలని ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య
తన జల్లికట్టు(Jallikattu) ఎద్దును అమ్మేయాలని ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తన జల్లికట్టు(Jallikattu) ఎద్దును అమ్మేయాలని ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని లాల్గుడి తాలూకాలో వెంకటాచలపురంకు చెందిన పి. మురుగనంతం తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న జల్లికట్టు ఎద్దును, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అమ్మివేసి, ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పదవ తరగతి వరకు మాత్రమే చదివిన మురుగనంతం, జీవనోపాధి కోసం చిన్నచితకా పనులు చేసేవాడని, ఎద్దును కొనుగోలు చేసిన తర్వాత, దాని సంరక్షణకు అంకితమై, పనికి వెళ్లడం మానేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు.
తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేస్తుండగా, అతని సోదరుడు ఐటీఐ పూర్తిచేసి టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎద్దు సంరక్షణకు అయ్యే ఖర్చులను భరించడం కుటుంబానికి కష్టంగా మారగా, దాన్ని అమ్మేయాలని ఒత్తిడి చేయడంతో మురుగనంతం కొన్ని రోజుల క్రితం ఎద్దును అమ్మాడు. ఆ తర్వాత అతను తీవ్ర మనస్తాపానికి గురై, అన్నం తినకుండా, ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడని తెలియజేశారు. ఆ బాధ తట్టుకోలేక పురుగుల మందు సేవించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, కల్లకుడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






