- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంప్లైంట్ తీసుకోలేదని పెట్రోల్ పోసి తహసీల్దార్ కారు తగలబెట్టేశాడు
తల్లి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదనే కోపంతో రగిలిపోయిన ఓ యువకుడు తహసీల్దార్ వాహనాన్ని తగలబెట్టేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన తల్లి ఇచ్చిన ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించడంతో కోపంతో రగిలిపోయిన ఓ యువకుడు తహసీల్దార్ (Tehsildar) వాహనాన్ని తగలబెట్టేశాడు. చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. పృథ్వీరాజ్ అనే వ్యక్తి బెంగళూరు (Banglore)లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. జులై 1న వెకేషన్ (Vacation)కి వెళ్లిన అతడు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన అతడి తల్లి 2వ తేదీన చల్లకెరె పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేయబోయింది. తన కుమారుడు కనిపించకుండా పోయాడని, మిస్సింగ్ కేసు నమోదుచేసి అతడికి కనిపెట్టాలని కోరింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది.
ఇక తాజాగా పృథ్వీరాజ్ జులై 23న తిరిగొచ్చాడు. పోలీసులు తన తల్లి ఫిర్యాదును స్వీకరించలేదని తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. అదే రోజు పోలీస్ స్టేషన్ (Police Station)కి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం చల్లకెరె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ గందరగోళం సృష్టించారు. ఆ నేపథ్యంలోనే కార్యాలయం ముందున్న తహసీల్దార్ వాహనంపైకి ఎక్కి, పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన సిబ్బంది అతన్ని అడ్డుకుని మంటలను ఆర్పేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పృథ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. అతడిపై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఆగస్టు 14న కూడా పృధ్వీరాజ్ ఇలాగే ఓ బైక్‌కు నిప్పంటించి తగలబెట్టాడు. ఆ కేసులో ఇప్పటికే విచారణ సాగుతోంది.






