- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కులు తక్కువ వచ్చాయని బాలికను కొట్టి చంపిన తండ్రి..
మహారాష్ట్ర సంగళీ జిల్లా నెలకరంజి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని కొట్టి చంపాడు కన్న కూతురిని కొట్టి చంపాడు తండ్రి. 17ఏళ్ల సాధన భోంస్లే డాక్టర్ కావాలని కలలు కన్నది. తండ్రి ధోండిరం భోంస్లే ప్రిన్సిపాల్ కాగా చదువు ఒత్తిడి ఎక్కువగానే ఉండేది.

దిశ, వెబ్‌సైట్ : మహారాష్ట్ర సంగళీ జిల్లా నెలకరంజి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని కొట్టి చంపాడు కన్న కూతురిని కొట్టి చంపాడు తండ్రి. 17ఏళ్ల సాధన భోంస్లే డాక్టర్ కావాలని కలలు కన్నది. తండ్రి ధోండిరం భోంస్లే ప్రిన్సిపాల్ కాగా చదువు ఒత్తిడి ఎక్కువగానే ఉండేది. సాధనకు పదో తరగతిలో 93శాతం మార్కులు వచ్చాయి. దీంతో నీట్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే నీట్ ప్రాక్టీస్ టెస్ట్‌లో తండ్రి అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మార్కులు ఎందుకు తగ్గాయనగా.. తండ్రి చదువులోని లోపాలను ఎత్తి చూపింది సాధన. దీంతో కోపంతో చెక్కతో తల మీద బాదాడు. తల్లి, అన్న అడ్డుపడినా చితకబాదాడు.
గాయాలయ్యాక ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్దామని తల్లి అభ్యర్థించినా తండ్రి ఒప్పుకోలేదు. ట్రీట్మెంట్ ఇప్పించలేదు. నెక్స్ట్ డే యోగా డే ఉండటంతో తండ్రి స్కూల్‌కు వెళ్లి వచ్చేసరికి స్పృహ లేకుండా పడిపోయింది సాధన. తీవ్రగాయాల కారణంగా హాస్పిటల్ చేరేలోగానే చనిపోయిందని.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. దీంతో తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ధోండిరంను అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది క్రమశిక్షణలో పెట్టే విధానం అస్సలే కాదు.. కచ్చితంగా హత్యగానే పరిగణించాలని, కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.






