ఉగ్రవాదులకు సహాయం చేసి.. నదిలోకి దూకిన వ్యక్తి..!

by velandi.Saikiran |   (  Updated:2025-07-25 06:38:10  IST  )

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ( Pakistani terrorists ) సహాయం చేసిన ఓ వ్యక్తి... నదిలో దూకేశాడు. ఇండియన్ అధికారులకు... భయపడి

ఉగ్రవాదులకు సహాయం చేసి.. నదిలోకి దూకిన వ్యక్తి..!
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ( Pakistani terrorists ) సహాయం చేసిన ఓ వ్యక్తి... నదిలో దూకేశాడు. ఇండియన్ అధికారులకు... భయపడి పోయి... అతడు నదిలో దూకేసినట్లు తెలుస్తోంది. కుల్గాం జిల్లాలో ( Kulgam District) పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ( Imtiaz Ahmed Magray) అనే వ్యక్తి సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అతను టాంగ్ మార్గ్ అడవిలో ( Tang Marg forest) ఉగ్రవాదులకు ఆహారం అలాగే ఆశ్రయం అందించినట్లు... పోలీసులు గుర్తించారు. విచారణలో కూడా అహ్మద్ మాగ్రే... ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలిపాడు. అయితే ఆదివారం రోజున వేషా నదిలో... దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో.. కొట్టుకుపోయి మునిగిపోయిన అహ్మద్ మాగ్రే... కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే నదిలో దూకిన అహ్మద్ మాగ్రే చనిపోయాడా? బతికే ఉన్నాడా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉన్నాయి. ఇది ఇలా ఉండగా... జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 మంది పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు అన్యాయంగా చంపేశారు. ఇక ఆ ఉగ్రవాదుల కోసం... ఇండియన్ అధికారులు గాలిస్తున్నారు.

Link

Next Story