ఇకపై సాధ్విగా కొనసాగుతా

by Ajay Maddhiboyina |

మమత కులకర్ణికి అత్యున్నత బిరుదు ఇవ్వడంపై అఖాడా వ్యవస్థాపకుడు అజయ్ దాస్, మమత గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.

ఇకపై సాధ్విగా కొనసాగుతా
X

- మహామండలేశ్వర్ పదవికి మమల కులకర్ణి రాజీనామా

- అత్యున్నత స్థానం ఇవ్వడంపై అభ్యంతరాలు

దిశ, నేషనల్ బ్యూరో: కిన్నర్ అఖాడాలో మాజీ సినీ నటి మమత కులకర్ణికి మహామండలేశ్వర్ పదవి ఇవ్వడంపై పలువురి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో తాను అత్యున్నత పదవి నుంచి వైదొలుగుతున్నానని.. ఇకపై సాధ్విగా మాత్రమే కొనసాగుతానని మమత సోమవారం తెలిపారు. కిన్నర్ అఖాడాలో మమత కులకర్ణ చేరిన తర్వాత అందులోని అఖాడాల మధ్య వివాదాలు చెలరేగాయి. కిన్నర్‌లో చేరిన కొద్ది కాలానికే ఆమెకు అత్యున్నత పదవి అయిన మహామండలేశ్వర్ హోదాను ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా మమత కులకర్ణిక మహా మండలేశ్వర్ పదవి ఇవ్వడంపై మండిపడ్డారు. ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు అకస్మాతుగా సన్యాసులు అయిన వెంటనే వారికి మహామండలేశ్వర్ వంటి పదవులు ఎలా పొందుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. మమత కులకర్ణికి అత్యున్నత బిరుదు ఇవ్వడంపై అఖాడా వ్యవస్థాపకుడు అజయ్ దాస్, మమత గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అజయ్ దాస్ నిబంధనలకు విరుద్దంగా అఖాడా నుంచి బయటకు వెళ్లి కుటుంబంతో నివశిస్తున్నాడని నారాయణ్ త్రిపాఠి ఆరోపించారు. కిన్నర్ అఖాడా నియమాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఉండే వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమై.. చివరకు మమత కులకర్ణిపై బహిష్కరణ వేటు వరకు వెళ్లింది. అయితే ఆ స్థానం నుంచి తాను తప్పుకుంటున్నానని. కేవలం సాధ్విగా మాత్రమే కొనసాగుతానని కులకర్ణి పేర్కొన్నారు.

Next Story