Mamatha: మోహన్ భగవత్ చరిత్రను వక్రీకరిస్తున్నారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై మమతా బెనర్జీ ఫైర్

by vinod kumar |
Mamatha: మోహన్ భగవత్ చరిత్రను వక్రీకరిస్తున్నారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై మమతా బెనర్జీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టించిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan bhagavath) చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) స్పందించారు. భగవత్ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆమె కోల్ కతాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భగవత్ కామెంట్స్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘ఆయన వ్యాఖ్యలు దేశ వ్యతిరేకం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవి ప్రమాదకరమైన కామెంట్స్ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదు’ అని అన్నారు. మన స్వాతంత్ర్య దినోత్సవాన్ని కోల్పోతే దేశానికి గుర్తింపు ఏమిటని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు చరిత్రను, రాజ్యాంగాన్ని మార్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్ర ఎంతో గర్వకారణమని దానిని మారుస్తారా అని నిలదీశారు. స్వాతంత్ర్య సమరయోధులను ఎవరూ మర్చిపోలేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story