Mamatha: బెంగాలీలను బంగ్లాదేశీయులుగా పిలుస్తున్నారు.. బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్

by B.Srinivas |

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే భారతీయులను బంగ్లాదేశీయులుగా పిలుస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Mamatha: బెంగాలీలను బంగ్లాదేశీయులుగా పిలుస్తున్నారు.. బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే భారతీయులను బంగ్లాదేశీయులుగా పిలుస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) ఆరోపించారు. బెంగాలీ మాట్లాడే పౌరులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. సరైన పత్రాలు ఉన్న బెంగాలీలను కూడా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో భాగంగా ఆమె ప్రసంగించారు. సొంత పౌరులను వారి భాష ఆధారంగానే బంగ్లాదేశీయులుగా పిలుస్తున్నందున బీజేపీ సిగ్గుపడాలన్నారు. బెంగాలీతో పాటు గుజరాతీ, మరాఠీ, హిందీ భాషల్లో మాట్లాడటానికి గర్వపడాలని నేను ఈ భాషలన్నింటిలోనూ మాట్లాడగలనని నొక్కి చెప్పారు.

ఒక వైపు భారతీయులను వారు మాట్లాడే పదాల కారణంగా బంగ్లాదేశీయులు అని పిలుస్తున్నారని, మరోవైపు ఓటరు ఐడీ కార్డ్స్, పాన్, ఆధార్ కార్డులు ఉన్న ప్రజలు వారి రాష్ట్రాల్లో జీవనోపాధి పొందే హక్కును కోల్పోతున్నారన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అయినప్పటికీ మరోసారి మమతా విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా రాష్ట్రంలోని ప్రజలకు సగటున 50 రోజుల ఉపాధి లభిస్తోందని, వివిధ పథకాల కింద 1.5 కోట్ల పని దినాలను సృష్టించిందని తెలిపారు.

Next Story