టార్గెట్‌ చేస్తే దేశాన్ని షేక్‌ చేస్తా... మమతా బెనర్జీ వార్నింగ్

by Ajay Maddhiboyina |

త‌న‌ను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా అంటూ ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వార్నింగ్ ఇచ్చారు. బొంగావ్ లో జ‌రిగిన SIR వ్య‌తిరేక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. SIRకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీ చేపడుతాన‌ని అన్నారు. బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నిబంధ‌న‌లు విధిస్తోంద‌ని చెప్పారు.

టార్గెట్‌ చేస్తే దేశాన్ని షేక్‌ చేస్తా... మమతా బెనర్జీ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: త‌న‌ను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా అంటూ ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వార్నింగ్ ఇచ్చారు. బొంగావ్ లో జ‌రిగిన SIR వ్య‌తిరేక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. SIRకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీ చేపడుతాన‌ని అన్నారు. బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నిబంధ‌న‌లు విధిస్తోంద‌ని చెప్పారు. బిహార్ లో బీజేపీ ప్ర‌చారాన్ని ఎత్తిచూపుతూ పొరుగు రాష్ట్రంలో బీజేపీ ఆట‌ల‌ను ఎవ‌రూ చూడ‌లేక‌పోతున్నార‌ని ఆరోపించారు. బెంగాల్ లో అలా ఉండ‌కూడ‌ద‌ని అన్నారు.

బెంగాల్ లో త‌నను గానీ త‌న ప్ర‌జ‌ల‌ను గానీ టార్గెట్ చేస్తే వీధుల్లోకి వ‌చ్చి మొత్తం దేశాన్ని క‌దిలిస్తాన‌ని హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల సంఘానికి ఓట‌ర్ లిస్టులో నుండి ఒక్క పేరును కూడా తొల‌గించే హ‌క్కు లేద‌ని ఎవ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని చెప్పారు. SIR నిర్వ‌హించ‌డానికి మూడేళ్లు ప‌డుతుంద‌ని దీనిని 2002లో చివ‌రిసారిగా నిర్వ‌హించార‌ని అన్నారు. కానీ అప్పుడు తాము దానిని వ్య‌తిరేకించ‌లేద‌న్నారు. నిజ‌మైన ఓట‌ర్ల‌ను తొల‌గించ‌లేమ‌ని చెప్పామ‌న్నారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌ను తొల‌గించ‌లేద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ పార్టీ కార్యాల‌యంలో ఓట‌ర్ల జాబితా స‌రిచేస్తోంద‌ని, ఈసీ దానికి అనుగుణంగా నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఆరోపించారు.

Next Story