- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
200 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం.. దీదీ షాకింగ్ కామెంట్స్
బెంగాల్ ఎన్నికల గెలుపుపై మరోసారి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ ఎన్నికల గెలుపుపై మరోసారి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు గెలిచి బెంగాల్ లో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం స్టాక్ మార్కెట్స్ ను తారుమారు చేయడానికే తప్పుడు ఎగ్జిట్ పోల్స్ సృష్టించారని ఆరోపించారు. 2021, 2024లో బీజేపీ ఇలానా చేసిందని ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల సమయంలో బెంగాల్ లో మోహరించిన కేంద్ర బలగాలు టీఎంసీ కార్యకర్తల పట్ల క్రూరంగా ప్రవర్తించారని అన్నారు. ప్రజలను భయపెడుతున్నారని, మే 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఆరోజు పార్టీ కార్యకర్తలు, నేతలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని లెక్కింపు కేంద్రాల్లో నిఘా పెంచాలన్నారు.






