Mamata: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టం అమలు చేయబోము.. సీఎం మమతా బెనర్జీ

by B.Srinivas |

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.

Mamata: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టం అమలు చేయబోము.. సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) వెల్లడించారు. మైనారిటీ ప్రజలను, వారి ఆస్తులను రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కోల్‌కతా (Kolkata) లో బుధవారం జైన సమాజం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతా ప్రసంగించారు. ‘వక్ఫ్ చట్టం అమలు కారణంగా మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. విశ్వాసంతో ఉండండి, బెంగాల్‌లో విభజించి పాలించేది ఏమీ జరగదు. అందరూ కలిసి ఉండాలనేదే నా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే వారి మాటలు వినొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో ఇటీవల జరిగిన హింసై స్పందిస్తూ.. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ఈ టైంలో బిల్లును ఆమోదించకూడదని తెలిపారు.

‘పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ (Bangladesh), పాకిస్తాన్ (Pakisthan), భారత్ అన్నీ కలిసి ఉండేవని చరిత్ర చెబుతోంది. విభజన అనంతం కూడా మైనారిటీలు ఇక్కడ నివసిస్తున్నారు. వారికి రక్షణ కల్పించడం మా పని’ అని తెలిపారు. ప్రజలు కలిసి నిలబడితే గొప్ప విజయాలు సాధించొచ్చని చెప్పారు. తాను ఉన్నంత వరకు మైనారిటీల ఆస్తులకు ఎటువంటి హాని జరగదని తేల్చి చెప్పారు. నేను అన్ని మత ప్రదేశాలను సందర్శిస్తానని, నన్ను చంపేసినా ఆ ఐక్యత నుంచి వేరు చేయలేరని నొక్కి చెప్పారు. దుర్గా పూజ, కాళి పూజ, జైన, బౌద్ధ దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు సందర్శించినట్టు తెలిపారు.

Next Story