- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటమి భయంతోనే మమతా బెనర్జీ రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు: అనురాగ్ ఠాకూర్
తనను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దిశ. వెబ్ డెస్క్: తనను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న SIR కి వ్యతిరేకంగా బొంగావ్‌లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. SIRకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీ చేపడుతానని అన్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనలు విధిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందించి కౌంటర్ ఎటాక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మార్పు ఖాయం అయిందని, మమతా బెనర్జీ ఓటమి భయంతోనే రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మమతా బెనర్జీని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్ సీఎం "మమతా బెనర్జీ లో కనిపిస్తున్న భయాందోళన, అసహనం ఆమె ఓటమికి సంకేతం. ఎన్నికలకు ముందే ఆమె ఓటమి ఖాయమైందని అర్థమవుతుంది," అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. "ఇది అవినీతి, హింస పతాక స్థాయికి చేరిన రాష్ట్రం. ఇక్కడ చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఓటమి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆమె ఇలాంటి ప్రకటనలు చేస్తూ, సాకులు వెతుక్కుంటున్నారు," అని విమర్శించారు. బీహార్ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కూడా ఇలాగే సాకులు చెప్పారని, కానీ బీహార్ ప్రజలు ఎన్డీఏకి చారిత్రక తీర్పు ఇచ్చారని ఠాకూర్ గుర్తు చేశారు. "బీహార్‌ను గెలిచాం; ఇప్పుడు బెంగాల్ వంతు," అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






