- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జూన్ 1న ఇండియా కూటమి భేటీకి రాలేను : మమతా బెనర్జీ
దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష ఇండియా కూటమి జూన్ 1న ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఇప్పటికే సమాచారాన్ని అందించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకు దూరంగా ఉండిపోయారు. ఆ రెండు పార్టీలపై విమర్శలు కూడా గుప్పించారు. దీంతో ఇండియా కూటమి సమావేశానికి ఆమె హాజరవుతారా ? లేదా ? అనే దానిపై నెలకొన్న సస్పెన్స్‌కు తాజాగా సోమవారం దీదీ తెరదించారు. జూన్ 1 కూటమి భేటీకి తాను రాలేనని మమత తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తుది విడత ఘట్టంలో బిజీగా ఉండటం, రెమాల్ తుఫానుతో బెంగాల్ ప్రభావితం అవుతున్నందున రాష్ట్రం వదిలి వచ్చే పరిస్థితి లేదని దీదీ స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చాక బయటి నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తానని గతంలోనే మమతా బెనర్జీ ప్రకటించారు.