కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై.. మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 13 |
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై.. మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. నేను కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సపోర్ట్ చేస్తున్నానని అయితే కాంగ్రెస్ కు మిగతా చోట్ల తమ మద్దతు కావాలంటే టీఎంసీ పట్ల అదే వైఖరి అనుసరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. బెంగాల్ లో కాంగ్రెస్ తమపై పోరాడకూడదని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన దీదీ.. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీ పోరాటం చేయదన్నారు. నిర్దిష్ట ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీలు కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు.

తాను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నానని చెబుతూనే బెంగాల్ విషయంలో పై విధంగా మాత్రం మెలిక పెట్టారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల పోరాడాలని అలాంటి చోట్ల వారికి మేము మద్దతు ఉటుంది. అయితే కాంగ్రెస్ కూడా తమ మిత్ర పక్షాలు బలంగా ఉన్న చోట్ల వారికి మద్దతు తెలపాలని అన్నారు. కాంగ్రెస్ ఏదైనా మంచిని సాధించాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే అని ఆమె అన్నారు.

Also Read..

సిద్ధ వర్సెస్ డీకే.. సీఎం కుర్చీ కోసం ముదిరిన వార్!



Next Story