- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రపతి పాలన విధించుకోండి.. మమతా బెనర్జీ మరో సంచలనం
రాష్ట్రపతి పాలన విధించుకోండి.. తాను మాత్రం రాజీనామా చేయనంటూ మమతా బెనర్జీ మరో సంచలన ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన TMC, అధికారం కోల్పోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ లో ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు మమతా బెనర్జీ. కావాలంటే డిస్మిస్ చేసుకోవాలని, రాష్ట్రపతి పాలన విధించుకోవాలని సవాల్ కూడా విసిరారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న మే 9 వ తేదీన బ్లాక్ డేగా పాటిస్తామని కూడా వెల్లడించారు మమతా బెనర్జీ. ఓడిపోయినా తమ పోరాటం మాత్రం ఎక్కడ ఆగదని తెలిపారు.
అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల పైన సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే, మమతా వ్యాఖ్యలకు సువెందు అధికారి తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. రాజకీయాల్లో మమతా బెనర్జీ ఇప్పుడు పూర్తిగా అప్రస్తుతం అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలకు స్పందించాల్సిన బాధ్యత బీజేపీకి లేదని కౌంటర్ ఇచ్చారు. ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా, రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తగిన చర్యలు తీసుకుంటారన్నారు.






