- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా పార్టీ వ్యూహాలు, డేటా దొంగిలించే కుట్ర.. ఈడీ రైడ్స్‌కు వ్యతిరేకంగా దీదీ భారీ ర్యాలీ
ఐప్యాక్ (I-PAC) సంస్థ కార్యాలయాలు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) శుక్రవారం కోల్‌కతాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐప్యాక్ (I-PAC) సంస్థ కార్యాలయాలు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) శుక్రవారం కోల్‌కతాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈడీ చర్యలను రాజకీయ కక్షసాధింపు గా అభివర్ణించిన మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఐప్యాక్‌పై జరిగిన దాడుల్లో మా పార్టీ వ్యూహాలు, డేటాను దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధ చర్య’ అని ఆమె మండిపడ్డారు.
నేను ఒక్క రోహింగ్యాని చూడలేదు...
కోల్‌కతా ర్యాలీలో ప్రసంగించిన మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన సీనియర్ బీజేపీ నేతలకు సంబంధించిన బొగ్గు కుంభకోణంపై నాకు సమాచారం ఉందని ఆరోపించారు. అవసరమైతే ప్రజల ముందు ఆధారాలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, బెంగాల్‌లో రోహింగ్యాలు ఉన్నారన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ‘ఇంతవరకు నేను ఒక్క రోహింగ్యాని చూడలేదు. రోహింగ్యాలు ఉంటే అస్సాంలోనే ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ఎందుకు జరుగుతోంది? వారు అస్సాం ద్వారా భారత్‌లోకి వచ్చి, ఆ తర్వాతే బెంగాల్‌కు వస్తారు’అని తెలిపారు. ఢిల్లీ నిరసనల సమయంలో తమ ఎంపీలపై పోలీసులు దాడి చేశారని, కానీ బెంగాల్‌లో బీజేపీ నేతలకు మాత్రం ‘రెడ్ కార్పెట్’ స్వాగతం లభిస్తోందని మమతా ఆరోపించారు. రాజకీయంగా నాపై దాడి చేసే ప్రయత్నం చేసిన ప్రతిసారీ నేను మరింత బలంగా మారుతాను.. అని అన్నారు. ఎన్నికల సంఘం సహకారంతో మహారాష్ట్రలో గెలిచిన బీజేపీ.. బెంగాల్‌లో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని చూస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.






