West Bengal: విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ-ఆర్ఎస్సెస్: మమతా బెనర్జీ

by S Gopi |

బీజేపీ, ఆర్ఎస్సెస్ తమ రాజకీయ లబ్ది కోసం అశాంతిని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

West Bengal: విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ-ఆర్ఎస్సెస్: మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్ఎస్సెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటీవలి హింస, విధ్వంసక చర్యలకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 'బెంగాల్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దౌర్జన్యాలకు దిగాయి. వారి మిత్రపక్షాల్లో ఆర్ఎస్సెస్ కూడా ఉంది. ఇది వరకు ఆర్‌స్సెస్ పేరు ప్రస్తావించలేదు, కానీ ఇప్పుడు తప్పట్లేదు. వారంతా కలిసి రాష్ట్రంలో ఒక దుర్మార్గపు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బాధాకరమైన అంశాన్ని వారి దుష్ట రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయి. ఇదొక బ్యాడ్ గేమ్' అని మమతా విమర్శించారు. దీన్ని గుర్తించాలని ఆమె ప్రజలను కోరారు. బీజేపీ, ఆర్ఎస్సెస్ తమ రాజకీయ లబ్ది కోసం అశాంతిని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. విభజన రాజకీయాలను ప్రోత్సహించేందుకు కొన్ని సమూహాలు పరిస్థితులను వాడుకుంటున్నాయి. మత సామరస్యం, సంఘీభావం అవసరం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. మతపరమైన అల్లర్లను అరికట్టాలి. అల్లర్ల వెనుక ఉన్న నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సమయంలో మెజారిటీ, మైనారిటీ వర్గాలు కలిసి పనిచేయాలని మమతా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మనుషుల ప్రాణాలు, గౌరవాన్ని రక్షించేందుకు గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సీఎం మమతా బెనర్జీ, వారు మరింత రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇటువంటి అల్లర్లు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. కొన్ని విద్రోహ శక్తులు ఎన్నికల రాజకీయాల కోసం ప్రజలను విభజించాలని చూస్తున్నాయని విమర్శించారు.

Next Story