- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి వాళ్లు పార్టీలో ఉండటానికి వీళ్లేదు.. సొంత నేతలకు ఖర్గే మాస్ వార్నింగ్
సొంత నేతలకు కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: సొంత నేతలకు కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీకి పనిచేయని నేతలంతా ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలని.. అలాంటి వారితో ఇటు పార్టీకి, అటు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యతలను విస్మరించే వారు ఎవరికి వారు స్వతహాగా పార్టీ నుంచి తప్పుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని తప్పకుండా గుర్తిస్తామని.. వారిని తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో అలాంటి వారికే టికెట్లు కేటాస్తామని.. వారిని గెలిపించుకునే బాధ్యత కూడా పార్టీనే తీసుకుంటుందని అన్నారు.
అంతకుముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt)పైనా ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తాడని తీవ్ర విమర్శలు చేశారు. భారత ఆర్థిక ఆర్థికవ్యవస్థలో ఇప్పుడు గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad) నగరంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ నిర్మించిన ప్రభుత్వరంగ ఫ్యాక్టరీలు అన్నింటినీ మోడీ అమ్ముతున్నారని ఖర్గే విమర్శించారు.






