- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశం కంటే మోడీకి ఎన్నికలే ముఖ్యం.. ప్రధాని తీరుపై ఖర్గే ఫైర్
జాతీయ సమస్యల కంటే ప్రధాని మోడీకి ఎన్నికలే ముఖ్యమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: జాతీయ సమస్యల కంటే ప్రధాని మోడీకి ఎన్నికలే ముఖ్యమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఫైర్ అయ్యారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో దాడి గురించి చర్చించడానికి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ డుమ్మా కొట్టారు. దీనిపై స్పందించిన ఖర్గే దేశ గౌరవం దెబ్బతిన్నప్పుడు ప్రధాని బీహార్‌లో ఎన్నికల ప్రసంగం చేయడం దురదృష్టకరం అని మండిపడ్డారు. అన్ని పార్టీల నేతలు హాజరయ్యారని కానీ ప్రధాని మోడీ రాలేదని బీహార్ ఏమైనా దూరంగా ఉందా అని ప్రశ్నించారు.
ప్రధాని మీటింగ్‌కు వచ్చి తదుపరి కార్యాచరణ గురించి చర్చించాల్సిందని అన్నారు. మా నుండి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారో చెప్పాల్సిందని అన్నారు. మోడీ ఈ దేశానికి నిరుద్యోగాన్ని, పేదరికాన్ని ఇచ్చారని, 56 అంగులాల చాతి కుచించుకుపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దేశంలో యునిటీ గురించి మాట్లాడితే బీజేపీ దాన్ని బ్రేక్ చేస్తుందని ఆరోపించారు. ఈ దేశంలో రాజ్యాంగమే అన్నింటికంటే గొప్పదని మన ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ఎదుగుతున్నప్పుడల్లా బీజేపీ అనిచివేయడానికి ప్రయత్నిస్తుందని కానీ మేం అనిచివేయబడేవాళ్లం కాదని ఖర్గే వ్యాఖ్యానించారు.






