మహిళ నర్సుల కంటే పురుష నర్సులకే జీతం ఎక్కువ.. తాజా అధ్యయనంలో ఇంట్రెస్టిగ్ విషయాలు

by Prasad Jukanti |

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సింగ్ వర్క్ ఫోర్స్ పై తాజా అధ్యయనం కీలక విషయాలు వెల్లడించింది.

మహిళ నర్సుల కంటే పురుష నర్సులకే జీతం ఎక్కువ.. తాజా అధ్యయనంలో ఇంట్రెస్టిగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోగులకు సేవలు అందించే నర్సింగ్ వృత్తి దైవంతో సమానంగా భావిస్తారు. అలాంటి నర్సింగ్ వృత్తి (nursing profession) అంటే మహిళలదే అన్న భావన ఇప్పటికీ ఉంది. మారుతున్న కాలంతో పాటు పురుషులు సైతం ఈ వృత్తిలోకి వచ్చేందుకు ఇప్పుడిప్పుడు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ప్రపంచ నర్సింగ్ వర్క్ ఫోర్స్ లో మహిళలే మెజార్టీ వాటా కలిగి ఉన్నప్పటికీ మహిళల కంటే పురుష నర్సులే (male nurse) ఎక్కువ సంపాదిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. స్త్రీ, పురుష నర్సుల మధ్య 24 శాతం పాయింట్ల వేతనం వ్యత్యాసం ఉందని బీఎంజే లో (BMJ study) ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. నర్సులకు సాధికారత కల్పించడం అంటే కేవలం శ్రామిక శక్తి కొరతను పరిష్కరించడం మాత్రమే కాదని అందరికీ హెల్త్ కవరేజీని సాధించడంలో కీలకమైన వృత్తి సామర్థ్యాన్ని వెలికితీయడం కూడా అని పేర్కొంది.

భారత్ లో 670 మందికి ఒక్కరే నర్సు:

ప్రపంచవ్యాప్తంగా 5.8 మిలియన్ల మంది నర్సింగ్ సిబ్బంది కొరత ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. భారత దేశంలో నర్సులు- జనాభా నిష్పత్తి 1:670 ఉందని ఇది ఇది డబ్ల్యుహెచ్ వో సిఫార్సు చేసిన 1:300 కంటే తక్కువ అని పేర్కొంది. 2030 నాటికి భారత దేశం మొత్తం 2.74 మిలియన్ల నర్సులను కలిగి ఉండాలనే లక్ష్యంగా పెట్టుకుందని, భారతదేశంలో పురుష నర్సులు ఎమర్జెన్సీ ఐసీయూ వంటి ప్రత్యేక విభాగాలకే ఎక్కువ శాతం పరిమితం అయినట్లు తెలిపింది. రోగి సౌకర్యం లింగ విభేదం కారణంగా ప్రసూతి, పిల్లల వైద్యం సహా ఇతర విభాగల్లో పురుష నర్సులు లేరని తెలిపింది. పిలిప్పీన్స్, భారత్ నుంచి అమెరికా, యూకే లు ఎక్కువ మంది నర్సులను నియమించుకుంటున్నాయని తెలిపింది. 13 శాతం మంది నర్సులు తమ పుట్టిన లేదా శిక్షణ పొందిన దేశానికి బదులు వేరే దేశంలో పని చేస్తునన్నారని, భారత దేశంలో 2030 నాటికి 2.47 మిలియన్ నర్సులు, విడ్ వైఫ్స్ అవసరం ఉంటుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. వీరిలో కేవలం 1.4 మిలియన్లు మాత్రమే యాక్టివ్ గా పని చేసే అవకాశం ఉందని ప్రతి యేటా 1.57 లక్షల నర్సింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారని తెలిపింది. సాంకేతిక పురోగతి ఆవిష్కరణలు ఎత వేగంగా వచ్చినా అవి మానవీయ సంరక్షణకు తోడ్పడేలా ఉండాలని అధ్యయనం స్పష్టం చేసింది.

Next Story