- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamilanadu: పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపేస్తున్నాను అని గవర్నర్ చెప్పడంలో అర్థం లేదని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులను గవర్నర్ నిలిపేయడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిలిపేస్తున్నాను అని గవర్నర్ చెప్పడంలో అర్థం లేదని జేబీ పార్దివాలాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను నిలిపేయడంపై సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ.. గవర్నర్ తన సొంత విధానాన్ని అవలంబిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. బిల్లులను తిరిగి పంపేందుకు కారణాలేంటని, నిలిపేయాలనే నిర్ణయం గురించి కోర్టుకు వివరించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. బిల్లులను నిలిపేయడంపై గవర్నర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉండవచ్చు. ప్రభుత్వాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. లేకపోతే కోర్టుకు బిల్లులు నిలిపేయడం వెనకున్న కారణాలు ఎలా తెలుస్తాయి? గవర్నర్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల నుంచి వాటి గురించి ఏమని చర్చించారు, ఏం పరిశీలించారు, లోటుపాట్లు ఏంటి, గవర్నర్ గుర్తించిన లొసుగులు ఏంటి? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోనీ ఏ అధికారి అయినా ఆయా బిల్లుల్లో ఇవి లోపాలు అని సూచించారా? ఈ విషయాలు ఎలా తెలుస్తాయని జస్టిస్ పార్దివాలా అడిగారు. కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెండింగ్ బిల్లులపై కొన్నేళ్ల నుంచి వివాదం కొనసాగుతోంది. అసెంబ్లీ ఆమోదం తెలిపిన కొన్ని బిల్లులను గవర్నర్ క్లియర్ చేయడం లేదంటూ 2023లో మొదటిసారి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపిన 10 బిల్లులను పెండింగ్‌లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.






