Makaravilakku : ఈనెల 15న మకరజ్యోతి దర్శనం

by Muthe.Rajitha |   (  Updated:2025-01-04 15:27:28  IST  )

శబరిమల(Shabarimala) అయ్యప్పస్వామి ఆలయం(AyyappaSwamy Temple)లో ఈనెల 15న 'మకరజ్యోతి దర్శనం'(Makaravilakku) నిర్వహించనున్నట్టు, శబరిమల ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

Makaravilakku : ఈనెల 15న మకరజ్యోతి దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్ : శబరిమల(Shabarimala) అయ్యప్పస్వామి ఆలయం(AyyappaSwamy Temple)లో ఈనెల 15న 'మకరజ్యోతి దర్శనం'(Makaravilakku) నిర్వహించనున్నట్టు, శబరిమల ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించనున్న మకరజ్యోతి(మకరవిలక్కు) దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజూ 90 వేల మంది కన్నా ఎక్కువ మంది భక్తులు శబరిమలకు వస్తుండటంతో విపరీతమైన రద్దీ ఉంటోంది. మకరజ్యోతిని దర్శించడానికి భక్తులంతా ఎక్కవ భారీగా గుమికూడి ఉంటారో ఆయా ముఖ్యమైన ప్రదేశాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గత డిసెంబర్ 30న శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని తెరిచారు. మండల పూజ తరువాత డిసెంబర్ 26న మూసివేశారు. ఏటా జరిగే 41 రోజుల సుదీర్ఘయాత్రకు సంకేతంగా ముందుగా అవన్నీ పూర్తి చేశారు.

Next Story