Makan Wapas Lo : ‘మకాన్ వాపస్ లో’ నిరసన.. ముస్లిం వ్యక్తికి ఇంటి విక్రయంపై అభ్యంతరం

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని పేరొందిన టీడీఐ సిటీ సొసైటీలో ఒక ఫ్లాట్‌ను ఇటీవలే ఓ ముస్లిం డాక్టర్‌కు విక్రయించారు.

Makan Wapas Lo : ‘మకాన్ వాపస్ లో’ నిరసన.. ముస్లిం వ్యక్తికి ఇంటి విక్రయంపై అభ్యంతరం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని పేరొందిన టీడీఐ సిటీ సొసైటీలో ఒక ఫ్లాట్‌ను ఇటీవలే ఓ ముస్లిం డాక్టర్‌కు విక్రయించారు. డాక్టర్ అశోక్ బజాజ్ నుంచి డాక్టర్ ఇఖ్రా చౌదరి ఇంటిని కొన్నారు. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ సొసైటీలో నివసిస్తున్న పలు కుటుంబాల వారు నిరసనకు దిగారు. సదరు ముస్లిం వ్యక్తికి విక్రయించిన ‘ఇంటిని వెనక్కి తీసుకోవాలంటూ’(మకాన్ వాపస్ లో) నినాదాలు చేశారు. ఈమేరకు స్లోగన్స్‌ రాసిన ఫ్లెక్సీలు, ప్లకార్డులను ప్రదర్శించారు.

ఇతర మతాలకు చెందిన వారికి ఇళ్లను విక్రయిస్తే.. టీడీఐ సిటీ సొసైటీలో అశాంతి చోటుచేసుకునే ముప్పు ఉంటుందని నిరసనకారులు పేర్కొన్నారు. సొసైటీలో దాదాపు 400కుపైగా హిందూ కుటుంబాలే నివసిస్తున్నాయని చెప్పారు. ఇటీవలే ముస్లిం వ్యక్తికి విక్రయించిన ఇల్లు.. సొసైటీలోని ఆలయానికి సమీపంలో ఉందన్నారు. ఈ నిరసనల్లో టీడీఐ సిటీ సొసైటీ ఛైర్మన్ అమిత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ నిరసనల అంశం చివరకు జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) అనుజ్ కుమార్ సింగ్ దృష్టికి చేరింది. ఇరువర్గాలకు అమోదయోగ్యంగా ఉండే పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్నట్లు డీఎం తెలిపారు.

Next Story