DELL: టెక్ రంగంలో తీవ్ర కలకలం..! ‘DELL’‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్

by Kema Shiva Kumar |

ఇరాన్ ప్రభుత్వం ఐటీ దిగ్గజం డెల్ (Dell) కంపెనీని ఓ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

DELL: టెక్ రంగంలో తీవ్ర కలకలం..! ‘DELL’‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (Westi Asia)లో తీవ్ర ఉద్రక్తతల వేళ అమెరికాకు చెందిన మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ డెల్ (Dell)పై ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డెల్ సంస్థను ఉగ్రవాద సంస్థ (Terrorist Company)గా అభివర్ణిస్తూ ఇరాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయంపై డెల్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. తన ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ అంతర్గత మెమో జారీ చేసింది. ఉద్యోగులెవరూ ప్రస్తుతం ఇరాన్ పర్యటనకు వెళ్లవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇరాన్ సంస్థలతో లేదా అక్కడి వ్యక్తులతో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ డేటా, నెట్‌వర్క్ భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఐటీ విభాగాలను ఆదేశించింది.

మొత్తం 18 కంపెనీలకు IRGC హెచ్చరిక..

అమెరికా - ఇరాన్ యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా, ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీ, ఫైనాన్స్ సంస్థల వైపు మళ్లుతోంది. అమెరికాకు చెందిన 18 ప్రముఖ కంపెనీలే తమ టార్గెట్‌గా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (IRGC) ప్రకటించింది’. ప్రముఖ ఐటీ సంస్థలు అన్నీ అమెరికా ప్రభుత్వానికి గూఢచారులుగా వ్యవహరిస్తున్నాయని ఐఆర్‌జీసీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని పంపింది. మార్చిలో ఇచ్చిన హెచ్చరికలనే పునరావృతం చేస్తూ, ఈసారి నేరుగా కంపెనీల పేర్లను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

Next Story