- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూసుకొచ్చిన యువకుడు.. బిత్తరపోయిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పర్యటనలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పర్యటనలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాదయాత్ర నిర్వహిస్తుండగా, ఊహించని విధంగా ఓ యువకుడు రక్షణ వలయాన్ని ఛేదించుకుని ఆమె ముందుకు దూసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన వేళ, మమతా బెనర్జీ కట్టుదిట్టమైన భద్రత మధ్య రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఆమె అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో, జనం మధ్య నుంచి ఓ యువకుడు మమతా బెనర్జీ కాళ్లు మొక్కేందుకు మెరుపు వేగంతో భద్రతా సిబ్బందిని దాటుకుని నేరుగా ముఖ్యమంత్రి వైపు దూసుకొచ్చాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక్క క్షణం బిత్తరపోయిన ఆమెను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని అడ్డుకున్నారు. గతంలో కూడా ఎన్నికల ప్రచార సమయంలో మమతా బెనర్జీకి గాయాలైన ఘటనలు ఉండటంతో, తాజా పరిణామం టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన నింపింది.






