రాంచీలో భారీ అగ్ని ప్రమాదం

by Muthe.Rajitha |

జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం ఉదయం ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

రాంచీలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం ఉదయం ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. క్షణాల్లో ఇతర ఫ్లాట్స్ కు వ్యాపించాయి. అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న వారు వెంటనే బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణనష్టం, క్షతగాత్రులపై ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని అన్నారు. అయితే గ్యాస్‌ లీకేజీ, లేదా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story