- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉన్న అక్కల్‌కోట్ రోడ్డు (Akkalkot Road)లోని MIDC సెంట్రల్ టెక్స్ టైల్ కంపెనీ (Central Textile Company)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉన్న అక్కల్‌కోట్ రోడ్డు (Akkalkot Road)లోని MIDC సెంట్రల్ టెక్స్ టైల్ కంపెనీ (Central Textile Company)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడినట్లు సోలాపూర్ (Solapur Fire Accident) మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాకేష్ సలుంఖే తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్య సమయంలో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు.
అగ్నిప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 10-12 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కబాడే, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు, మునిసిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి శక్తిసాగర్ ధోలే వెల్లడించారు. మృతులను ఉస్మాన్ భాయ్ మన్సూరి (78), అనాస్ మన్సూరి (24), షిఫా మన్సూరి (23), యూసఫ్ మన్సూరి (1)లుగా గుర్తించారు. కాగా.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రాలేదని, వారివద్ద అత్యాధునిక పరికరాలు లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి తమవాళ్లు చనిపోయారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.






