బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఓ మావోయిస్టు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-05 08:31:19  IST  )

‘ఆపరేషన్ కగార్’‌‌లో భాగంగా మవోయిస్టులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.

బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఓ మావోయిస్టు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్’‌‌లో భాగంగా మావోయిస్టులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా, బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు చాలామంది దళ సభ్యులు సమావేశమయ్యారనే విశ్వసనీయ సమాచారం పోలీసు వర్గాలకు అందింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ లోకల్ పోలీసులు, సాయుధ దళం 7వ బెటాలియన్ సంయుక్తంగా జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు ఎదురుపడగా.. భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కాల్పులు జరిగిన స్థలంలో ఆటోమెటిక్ గన్స్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story