- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ప్రజలను వణికించిన భూకంపం (వీడియో)
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భూకంపం(Earthquake) సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భూకంపం(Earthquake) సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటలకు ఢిల్లీతోపాటు సమీప నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ అనూహ్య పరిణామంతో భయాందోళనకు గురైన ఢిల్లీ ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత నెల జనవరి 23వ తేదీన చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీలోనే బలమైన ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. అంతకుముందు రెండు వారాల క్రితం జనవరి 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Just Look at the Blast and Wave it was something else still thinking about it
— Mahiya18 (@mooniesssoobin) February 17, 2025
My Home CCTV video #earthquake #Delhi pic.twitter.com/AiNtbIh9Uc






