- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యా కురిల్ ఐలాండ్‌లో భారీ భూకంపం
రష్యాలోని (Russia) కురిల్ ఐలాండ్‌లో (kuril islands) భూకంపం (earthquake ) సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: రష్యాలోని (Russia) కురిల్ ఐలాండ్‌లో (kuril islands) భూకంపం (earthquake ) సంభవించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై ( Rector scale) దీని తీవ్రత 6.5గా నమోదైంది. రష్యన్ పట్టణానికి 219 కిలోమీటర్ల దూరంలోని కురీల్ దీవుల్లో సంభవించిన ఈ భూకంపం భూమికి 12 కిలోమీటర్ల దిగువన కేంద్రీకృతమైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలు ఇంకా తెలియలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
కాగా,కురిల్ దీవులు రష్యా సుదూర తూర్పు భాగంలో ఉన్న సఖాలిన్ ఒబ్లాస్ట్ (ప్రావిన్స్)లో ఉన్న ద్వీపసమూహం. ఈ ద్వీపసమూహం కమ్చట్కా ద్వీపకల్పం (రష్యా) దక్షిణ నుంచి హోక్కైడో ద్వీపం (జపాన్) ఈశాన్య మూలకు 750 మైళ్ళు వరకు విస్తరించి ఉంది. ఇవి ఓఖోట్స్క్ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రం నుంచి వేరు చేస్తాయి. ఇక ఇక్కడ దాదాపు 100 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో 35 ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయి. అనేక వేడి నీటి బుగ్గలు కారణంగా భూకంపాలు, సునామీలు ఇక్కడ సర్వసాధారణం.






