- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్-1బి వీసా విధానంలో భారీ మార్పులు.. పొజిషన్ ఆధారంగా జారీ!
అమెరికాలో హెచ్-1బి వీసాల జారీ విధానంలో కీలక మార్పులు రాబోతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్:అమెరికాలో (America) హెచ్-1బి వీసాల (H-1B Visa) జారీ విధానంలో కీలక మార్పులు రాబోతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ కార్యవర్గం, మరోసారి ఈ వీసా విధానాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ, ఓ ప్రతిపాదనను వైట్‌హౌస్‌లోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యూలేటరీ అఫైర్స్ కార్యాలయానికి సమర్పించింది.
ప్రస్తుతం హెచ్-1బి వీసాలపై ఉండే వార్షిక పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది 85,000గా ఉండగా, ఇందులో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి రిజర్వ్ చేస్తారు. పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల విభాగాల కోసం మాత్రం పరిమితులు లేవు.
అయితే, 2026 సంవత్సరానికి ఇప్పటికే అవసరమైన దరఖాస్తులు వచ్చిపోవడంతో, యూఎస్‌సీఐఎస్ ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిందని ప్రకటించింది. దీనివల్ల లాటరీ విధానం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దరఖాస్తుదారుల ఎంపికకు లాటరీ విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. ట్రంప్ 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత, వీసాలను లాటరీ ద్వారా కాకుండా ఆ ఉద్యోగానికి ఆఫర్ చేసే జీతం ఆధారంగా జారీ చేశారు. దీని వెనుక ఉద్దేశ్యం.. అమెరికన్ కంపెనీలు అధిక నైపుణ్యం ఉన్నవారిని నియమించుకునేలా ప్రోత్సహించడం, తక్కువ వేతనాల ఉద్యోగాల్లో విదేశీయుల నియామకాన్ని నియంత్రించడమే. దీనిని 'బై అమెరికన్, హైర్ అమెరికన్' విధానంగా ప్రచారం చేశారు.
అయితే, 2021లో బైడెన్ అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని పక్కనబెట్టారు. ఇక తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పంపిన ప్రతిపాదనపై భారీగా స్పందన లభించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం దాదాపు 1,000 పబ్లిక్ కామెంట్లు అందాయి. ఇది అమలైతే హెచ్-1బి ఉద్యోగులు తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంతవరకు లాటరీ విధానం, ఎవరికైనా సమాన అవకాశాలతో అమలవుతూ వచ్చింది. కానీ పెద్ద పెద్ద కంపెనీలు భారీగా దరఖాస్తులు చేసేసి అధికంగా వీసాలు పొందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రొగ్రెస్’ అనే థింక్‌ట్యాంక్ జనవరిలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, సీనియార్టీ, జీతాల ఆధారంగా వీసాల జారీ చేపట్టాలన్న సిఫార్సు చేసింది. అలా జరిగితే వీసాల ఆర్థిక విలువ దాదాపు 88 శాతం పెరిగే అవకాశముందన్న విశ్లేషణ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసా విధానంలో మళ్లీ కీలక మలుపు తలెత్తబోతున్నట్లు అనిపిస్తోంది.






