- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో ఘోర ప్రమాదం.. ములుండ్‌లో కుప్పకూలిన మెట్రో పిల్లర్, శ్లాబ్
ముంబైలోని ములుండ్ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మరియు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ముంబై (Mumbai)లో ఇవాళ మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ములుండ్ (Mulund) వెస్ట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌తో పాటు భారీ శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మెట్రో పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో, పిల్లర్, శ్లాబ్ ముక్కలు నేరుగా రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ఈ శిథిలాల కింద చిక్కుకొని పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మేరకు నలుగురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వారిని చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్..
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గ్యాస్ కట్టర్లు, భారీ క్రేన్ల సహాయంతో పిల్లర్ భాగాలను తొలగిస్తున్నారు. భారీ ప్రమాదం కారణంగా ములుండ్ వెస్ట్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.






