- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maintenance: తల్లికి రూ.5 వేలు ఇవ్వాలన్న ట్రయల్ కోర్టు తీర్పుపై పిటిషన్.. కుమారుడిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
తన 77 ఏళ్ల తల్లికి రూ. 5వేల మెయింటెనెన్స్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: తన 77 ఏళ్ల తల్లికి రూ. 5వేల మెయింటెనెన్స్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై పంజాబ్ (Panjab), హర్యానా(Haryana)ల ఉమ్మడి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సదరు పిటిషనర్‌పై తీవ్రంగా మండిపడింది. అంతేగాక ఆయనకు భారీ జరిమానా సైతం విధించింది. ఆ వ్యక్తి తన తల్లి పేరు మీద రూ.50,000 ఫ్యామిలీ కోర్టులో మూడు నెలల్లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ పరిణామాన్ని కలియుగానికి ఉదాహరణగా అభివర్ణించింది. ఈ కేసు కోర్టు మనస్సాక్షిని కదిలించిందని తెలిపింది. ఈ మేరకు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిని ఒక దురదృష్ట కేసు అని పేర్కొంది.
ఓ మహిళ భర్త 1992లో మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉండగా చిన్న కొడుకు సైతం తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణం తర్వాత మహిళ తన పెద్ద కుమారుడు, రెండో కుమారుడి పిల్లకు 50 బిఘాల భూమిని పంచి ఇచ్చింది. ఆ టైంలో మహిళ భవిష్యత్ రిత్యా రూ. లక్ష ఇవ్వాలని, అంతేగాక ప్రతి నెల రూ.5000 ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత మహిళ కుమార్తెతో కలిసి జీవించడం ప్రారంభించింది. దీంతో తల్లి తనతో నివసించడం లేదని, కాబట్టి దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయం చెల్లదని ఆమె కుమారుడు హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై న్యాయమూర్తి జస్‌గుర్ ప్రీత్ సింగ్ విచారణ చేపట్టి పై వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానా విధించారు. ఫ్యామిలీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్దంగా ఉన్నాయని తెలిపారు. కొడుకు తన సొంత తల్లిపైనే పిటిషన్ దాఖలు చేయడం కోర్టు మనస్సాక్షిని నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి ఇచ్చే మెయింటెనెన్స్ చిన్నదే అయినప్పటికీ దానిని పెంచాలని తల్లి మళ్లీ కోర్టును ఆశ్రయించలేదని తెలిపింది.






