ఇతర మతస్థుల ఎస్సీ రిజర్వేషన్లు రద్దు..సీఎం సంచలన ప్రకటన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-18 05:15:52  IST  )

మ‌హ‌రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందువులు మాత్ర‌మే ఎస్సీ రిజ‌ర్వేష‌న్ కు అర్హుల‌ని అన్నారు. హిందువులు, బౌద్ధులు, సిక్కు మ‌త‌స్థులు కాకుండా కాకుండా ఇత‌ర మ‌తాల‌వాళ్లు ఎస్సీ

ఇతర మతస్థుల ఎస్సీ రిజర్వేషన్లు రద్దు..సీఎం సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మ‌హ‌రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందువులు మాత్ర‌మే ఎస్సీ రిజ‌ర్వేష‌న్ కు అర్హుల‌ని అన్నారు. హిందువులు, బౌద్ధులు, సిక్కు మ‌త‌స్థులు కాకుండా ఇత‌ర మ‌తాల‌వాళ్లు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ పొందితే వాటిని ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు. త‌ప్పుడు న‌మోదు ప‌త్రాల‌ను స‌మ‌ర్పించి ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొందినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అలాంటి వాళ్లు ఫేక్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించి ఎన్నిక‌ల్లో పోటీ చేసినా వారి ఎన్నిక‌ను సైతం ర‌ద్దు చేస్తామ‌న్నారు.

త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు పొందితే వాళ్ల నుండి డ‌బ్బులు తిరిగి వ‌సూలు చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. బ‌ల‌వంత‌పు, మోస‌పూరిత‌మైన మ‌త మార్పిడుల‌ను అరి క‌డ‌తామ‌ని వాటిపై ఉక్కుపాదం మోపుతామ‌ని అన్నారు. మ‌త మార్పిడులు అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చేందుకు ఆలోచ‌న చేస్తుంద‌ని చెప్పారు. మ‌రోవైపు బీజేపీ ఎమ్మెల్యే అమిత్ గోర్ఖే మాట్లాడుతూ.. కొంత‌మంది క్రైస్త‌వులు మ‌త‌స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని అన్నారు. ఇత‌ర మ‌తాల్లో చేరిన‌ప్ప‌టికీ స‌ర్టిఫికెట్ల‌లో హిందూ మ‌తం పేరుతో ఎస్సీ రిజ‌ర్వేష‌న్ పొందుతున్నార‌ని ఆరోపించారు. ఇక మ‌హారాష్ట్ర సీఎం, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి.

Next Story