- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోమియోపతి వైద్యులపై సర్కార్ సంచలన నిర్ణయం
హోమియోపతి వైద్యులను ఆల్లోపతి వైద్య నిపుణులుగా మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.

దిశ, వెబ్ డెస్క్ : హోమియోపతి వైద్యులను ఆల్లోపతి వైద్య నిపుణులుగా మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఈ విధానాన్ని సమీక్షించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేవనెత్తిన భద్రతా సమస్యల నేపథ్యంలో మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో హోమియోపతి వైద్యులను ఆధునిక వైద్య నిపుణులుగా నమోదు చేయడాన్ని మహారాష్ట్ర తాత్కాలికంగా నిలిపివేసింది.
హోమియోపతి వైద్యులను ఆధునిక వైద్యం అభ్యసించడానికి అనుమతిస్తే ప్రజల ఆరోగ్యానికి, రోగుల జీవితాలకు "ముప్పు" ఏర్పడుతుందని పేర్కొంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (మహారాష్ట్ర రాష్ట్ర సంఘం) మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2014 నాటి మహారాష్ట్ర చట్టం 19 ప్రకారం, 1959 నాటి మహారాష్ట్ర హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ చట్టం మరియు 1965 నాటి మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చట్టంలో సవరణలు చేయబడ్డాయి. దీని ద్వారా రాష్ట్రంలోని హోమియోపతి వైద్యులు ఆధునిక ఫార్మకాలజీ (సిసిఎంపి)లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆధునిక వైద్యం అభ్యసించడానికి వీలు కల్పించారు.
హోమియోపతి వైద్యుల ప్రాక్టీస్ : మహారాష్ట్ర ప్యానెల్ ఏర్పాటు
ఆధునిక, హోమియోపతి వైద్యుల నుంచి అభిప్రాయాలను సేకరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు నెలల్లోపు నివేదికను సమర్పించాలని కోరింది. అధ్యయన కమిటీ సభ్యులుగా పలువురు కీలక అధికారులను నియమించింది. దీని ఆధారంగా రానున్న రోజుల్లో తుదినిర్ణయం తీసుకోనంది.






