GBS Virus Threat: మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వల్ల తొలి మరణం నమోదు

by Shamantha N |

మహారాష్ట్రను కొత్త వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదుగా భావిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ తో అక్కడ తొలిమరణం సంభవించింది.

GBS Virus Threat: మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వల్ల తొలి మరణం నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రను కొత్త వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదుగా భావిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ తో అక్కడ తొలిమరణం సంభవించింది. పూణేక చెందిన వ్యక్తి స్వగ్రామం సోలాపూర్ కు వెళ్లగా.. అక్కడ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో, అతడు సోలాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు జీబీఎస్ ఉన్నట్లు నిర్ధారించారు. పూర్తి బలహీనంగా మారడంతో ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. అయితే, ఆరోగ్యపరిస్థితి కొంత మెరుగుపడటంతో అతడ్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. కాగా.. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో.. ట్రీట్మెంట్ అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. శనివారం అతడు చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఇకపోతే, మహారాష్ట్ర పూణేలో వెలుగుచూసిన గులియన్ బారే సిండ్రోమ్(GBS) వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 73 కేసులు నమోదు కాగా వీరిలో 14 మది వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక ర్యాపిడ్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసింది.

జీబీఎస్ లక్షణాలు ఇవే

జీబీఎస్ వైరస్ అనేది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి నరాల బలహీనత, తిమ్మిరి, పక్షపాతం వంటి వాటికి దారితీస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు సరికదా కోలుకునేందుకు చాలా సమయం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యాధికి గురైన రోగులు మంచానపడాల్సి వస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందు శ్వాస సంబంధిత లక్షణాలు కన్పిస్తాయి. బాధితులు మెట్లెక్కడం, నడవడం కష్టమౌతుంది. నరాల బలహీనత, కాళ్లు -చేతులు , ముఖం-శ్వాస కండరాలు పూర్తిగా పటుత్వం కోల్పోవచ్చు. నరాలు దెబ్బతినడంతో మెదడు నుంచి అసాధారణ సంకేతాలు కన్పిస్తాయి. హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది. రక్తపోటులో మార్పు కన్పిస్తుంది. జీర్ణక్రియ సమస్య, మూత్రాశయం నియంత్రణ సమస్యగా మారుతుంది.

Next Story