అమానవీయం.. ప్రసవం కోసం 6కి.మీ నడిచి నిండు గర్భిణీ మృతి

by Naga Rani Yarlagadda |

అభివృద్ధి, టెక్నాలజీ అంతా పట్టణాల్లోనే జరుగుతుంది కానీ.. మారుమూల ప్రాంతాలను పట్టించుకోవడంలేదు అనేందుకు ఈ ఘటన ఉదాహరణ.

అమానవీయం.. ప్రసవం కోసం 6కి.మీ నడిచి నిండు గర్భిణీ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీలో మనమంతా ముందున్నామని అనుకుంటున్నాం కానీ.. దేశంలో మారుమూల ప్రాంతాలు, పల్లెల్లో కనీస రోడ్డు, వైద్య సదుపాయాలు లేక అకాల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అభివృద్ధి, టెక్నాలజీ అంతా పట్టణాల్లోనే జరుగుతుంది కానీ.. మారుమూల ప్రాంతాలను పట్టించుకోవడంలేదు అనేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ. ప్రసవం కోసం నిండుగర్భిణీ 6 కిలోమీటర్లు నడిచి, అలసిపోయి, తీవ్ర రక్తస్రాంతో గర్భస్థ శిశువుతో సహా ప్రాణాలు విడిచింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలీలో చోటుచేసుకుంది.

కడుపులోనే చనిపోయిన శిశువు

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశా సంతోష్ కిరంగ (24) 9 నెలల నిండు గర్భిణి. ఆమె సొంతూరు ఎటపల్లి తాలూకాలోని ఆల్డండి టోలో గ్రామంలో రోడ్డు మార్గం, కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. దీంతో ఆమె ప్రసవం కోసం తన భర్తతో కలిసి అటవీ మార్గంలో సుమారు 6 కిలోమీటర్లు నడిచి పెథాలో తన సోదరి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆశాకు తీవ్ర రక్తస్రావమై కడుపులోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. మహిళకు బీపీ పెరగడంతో ఆమె కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. మహిళను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతాప్ శిందే పేర్కొన్నారు. ఈ ఘటనపై తాలూకా ఆరోగ్య అధికారి నుంచి వివరణ కోరామని, విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

Next Story