Maharashtra: మహారాష్ట్రలో మహిళకు వేధింపులు.. వ్యక్తి దారుణ హత్య

by Shamantha N |

మహారాష్ట్రలో మహిళను వేధించిన వ్యక్తిని ఆమె తల్లిదండ్రులు నరికి చంపారు. నాందేడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

Maharashtra: మహారాష్ట్రలో మహిళకు వేధింపులు.. వ్యక్తి దారుణ హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో మహిళను వేధించిన వ్యక్తిని ఆమె తల్లిదండ్రులు నరికి చంపారు. నాందేడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఫిబ్రవరి 21న హడ్గావ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల షేక్ అరాఫత్‌ స్థానికంగా ఉన్న ఒక మహిళను వేధించాడు. అయితే, ఆ వ్యక్తి ఆ మహిళను పలుమార్లు వేధించినట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఈ ఘటనపై ఆగ్రహించారు. ఆ తర్వాత అరాఫత్‌ ఇంటికి వారు చేరుకున్నారు. అతడ్ని కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి తల్లిని కూడా కొట్టారు. కత్తితో అరాఫత్‌ను పొడిచి అతడ్ని హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అరాఫత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి హత్యకు సంబంధించి మహిళ తల్లిదండ్రులు, బంధువులతో సహా పది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story