Maharashtra: త్రిభాషా విధానంపై మహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్.. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు రద్దు

by B.Srinivas |

ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీ బోధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Maharashtra: త్రిభాషా విధానంపై మహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్.. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీ బోధించాలని మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వివాదం నెలకొనడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆర్డర్స్ రద్దు చేసింది. ఆదివారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra fadnavis) తెలిపారు. త్రిభాషా విధానం ఎలా అమలు చేయాలో అనే దానిపై డాక్టర్ నరేంద్ర జాదవ్ (Narendra Jadav) నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక అనంతరం మరోసారి నిర్ణయం తీసుకుంటామన్నారు. కమిటీ తన రిపొర్ట్ అందజేసే వరకు ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన ఉత్వర్వులు రద్దు చేస్తున్నామన్నారు.ఈ నిర్ణయంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. హిందీ భాషపై ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం మరాఠాల ఐక్యతకు విజయం అని కొనియాడారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే పోరాటానికి పిలుపునివ్వడంతోనే ప్రభుత్వం దిగొచ్చిందని తెలిపారు.

Next Story