- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CJI: న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మహారాష్ట్ర ముందంజ
కొల్హాపూర్ బెంచ్ కోసం భవనాన్ని చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ ఆదివారం అన్నారు. కొల్హాపూర్ జిల్లాలో బాంబే హైకోర్టు కొత్త సర్క్యూట్ బెంచ్‌ను సీజేఐ ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉందని కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు విన్నాను, వారి పేర్లను చెప్పదలచుకోలేదు. ఇది తప్పు. మౌలిక సదుపాయాల విషయంలో మహా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంది. కొల్హాపూర్ బెంచ్ కోసం భవనాన్ని చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కొల్హాపూర్‌లో బెంచ్ ఏర్పాటుకు తాను మద్దతు ఇస్తున్నాను. దీనివల్ల ఏ సామాన్యుడు కూడా తమ హక్కుల కోసం పోరాడేందుకు ముంబై హైకోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పూణేలో కూడా బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నుంచి డిమాండ్ ఉంది. అయితే, దీనిపై సామాన్యుల నుంచి డిమాండ్ వినిపించడంలేదు. కొద్దిమంది న్యాయవాదులు మాత్రమే కోరుతున్నారు. కొల్హాపూర్‌లో నాల్గవ బెంచ్ ఏర్పాటు అనేక వర్గాల నుంచి వచ్చిన డిమాండ్ల మధ్య జరిగింది. వారు తమ పిటిషన్ల విచారణ కోసం 380 కి.మీ దూరంలో ఉన్న ముంబైకి ప్రయాణించాల్సి వస్తోందని, బెంచ్ ఏర్పాటు ద్వారా వ్యాజ్యాలు, న్యాయవాదులపై భారాన్ని తగ్గించవచ్చని కోరినట్టు పేర్కొన్నారు.






