- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త డీజీపీగా సదానంద్ దాతే నియామకం
మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1990 బ్యాచ్ IPS అధికారి సదానంద్ వసంత్ దాతేను డీజీపీ (Director General of Police)గా నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రష్మి శుక్ల జనవరి 3, 2026న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా, సదానంద్ దాతేను కొత్త డీజీపీగా నియమించారు. ఆయన జనవరి జనవరి 3న లేదా మరునాడు పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
కాగా, సదానంద్ దాతే 26/11 ముంబై అటాక్స్ సమయంలో హీరోగా వెలుగొందారు. కామా హాస్పిటల్ వద్ద ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను నేరుగా ఎదుర్కొని తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఆయన శరీరంలో మెటల్ శకలాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గాలెంట్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. సదానంద్ దాతే మహారాష్ట్ర ఆంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) చీఫ్‌గా, ముంబైలో జాయింట్ కమిషనర్ (క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్), సీబీఐలో DIG, సీఆర్‌పీఎఫ్లో IG (ఆపరేషన్స్), మీరా-భయందర్-వసై-విరార్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. డిసెంబర్ 22, 2025న కేంద్రం ఆయనను మహారాష్ట్ర క్యాడర్‌కు తిరిగి పంపడంతో తాజాగా డీజీపీగా నియమితులయ్యారు.






