- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు.. రూ. 1339 కోట్ల సహాయం ప్రకటించిన ప్రభుత్వం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు రావడం తో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం చేకూరింది.

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో వరదలు రావడంతో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం (Crop damage due to floods) చేకూరింది. అలాగే మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతుండటంతో రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఆర్ధిక సహాయం (Financial assistance to farmers) చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రభుత్వం రూ. 1339 కోట్ల సహాయం అందించాలని నిర్ణయించింది. జూన్ 2025 నుంచి ఆగస్టు 2025 వరకు కురిసిన భారీ వర్షాలకు సహాయం ప్రకటించింది. కాగా ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను అన్ని జిల్లాల అధికారులు (District Officers) పరిశీలించి పంచ నామాలు చేశారు. అలాగే మరాఠ్వాడాలో ప్రస్తుత వర్షపాతం వల్ల దెబ్బతిన్న పంటలకు పంచ నామాలు ఇంకా చేయాల్సి ఉండగా.. వాటికి కూడా ప్రభుత్వం పంట నష్టం (పంట నష్టం) కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో వరదల వల్ల నష్టపోయిన రైతులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనున్నది.






