- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ.. మీరసలు మనుషులేనా.. అప్పు వసూలు కోసం రైతు చేత కిడ్నీ అమ్మించిన వడ్డీ వ్యాపారులు
వడ్డీ వ్యాపారుల కాసుల దాహానికి ఓ రైతు తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చింది

దిశ, డైనమిక్ బ్యూరో: వడ్డీ వ్యాపారుల కాసుల దాహానికి ఓ రైతు తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చింది. చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక అతడి చేత బలవంతంగా కిడ్ని అమ్మించి మరీ వడ్డీ వసూలు చేసుకున్న దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతు (Maharashtra Farmer) వ్యవసాయంలో నిత్యం నష్టాలు వచ్చాయి. దీంతో అతడు పాల వ్యాపారం ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాడు. దాంతో పెట్టుబడి కింద పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ. 10వేల వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు చెల్లించకపోవడంతో అది కాస్త రూ. 74 లక్షలకు చేరింది.
ప్రారంభానికి ముందే నష్టాలు:
అయితే తన పాడి వ్యాపారం ప్రారంభమయ్యేలోపే అతను కొనుగోలు చేసిన ఆవులు చనిపోయాయి. అలాగే తాను సాగు చేస్తున్న పంటలు దెబ్బతినడంతో అప్పుల ఊపిలో మరింత చిక్కుకుపోయాడు. దీంతో తిరిగి చెల్లించలేనంత అప్పుల్లో సదాశివ్ కూరుకుపోయారు. దీంతో తమ అప్పులు చెల్లించాలని వడ్డీ వ్యాపారాలులు అతని కుటుంబాన్ని వేధించడం ప్రారంభించారు. దీంతో చేసేదేమి లేక తన భూమి, ట్రాక్టర్ తో పాటు ఇతర విలువైన గృహోపకరణాలను అమ్మేశాడు.
కిడ్నీ అమ్ముకో..:
అయినా వాటితో అప్పు తీరకపోవడంతో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్ని అమ్ముకోవాలని (Kidney Sale) సదాశివ్‍కు సలహా ఇచ్చారు. దీంతో అతడు ఒక ఏజెంట్ ద్వారా కోల్ కతాకు వెళ్లి పరీక్షలు నిర్వహించుకుని అక్కడి నుంచి కంబోడియాకు వెళ్లారు. అక్కడ అతని కిడ్నీని తీసుకుని రూ.8 లక్షలు అతడి చేతిలో పెట్టారు. అయితే తన కిడ్నీ అమ్ముకున్నా అప్పులు తీరలేదని తాను మోసపోయానని గ్రహించిన సదాశివ్ తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అయినా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని దీంతో తాను మానసిక, శారీరక బాధలు మరింత పెరిగాయని తనకు న్యాయం జరగకపోతే తన కుటుంబంతో సహా మహారాష్ట్ర సచివాలం ఎదుట ఆత్మహుతి చేసుకుంటానని హెచ్చరించాడు.






