- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కూలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అజిత్ పవార్ (66) సహా ఆరుగురు మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలిపింది. బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా.. ఛార్టెడ్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 8.45 గంటలకు విమానం కూలిపోగా వెంటనే భారీ మంటలు చెలరేగి.. అందులో ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అజిత్ పవార్ మరణవార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయల్దేరారు. అజిత్ పవార్ మృతిపట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
READ MORE .....






