Assembly Speaker : రేపు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. మళ్లీ రాహుల్ నర్వేకర్‌కే ఛాన్స్

by Hajipasha |   (  Updated:2024-12-08 12:55:23  IST  )

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker) పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్(Narwekar) నామినేషన్ దాఖలు చేశారు.

Assembly Speaker : రేపు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. మళ్లీ రాహుల్ నర్వేకర్‌కే ఛాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker) పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్(Narwekar) నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం ఆయన తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర సెక్రటేరియట్‌లోని సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈసందర్భంగా నర్వేకర్ వెంట సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉన్నారు. సోమవారం రోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.

ఈ పోస్టు కోసం నామినేషన్ దాఖలు చేయడం లేదని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలోని విపక్ష పార్టీలు ప్రకటించాయి. దీంతో అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్టే. స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. గత అసెంబ్లీలోనూ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ వ్యవహరించారు. కొలాబా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Next Story