Mahakumbha Mela : మహాకుంభ మేళాతో ఖర్చు లేని సంపాదన!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-01 05:20:43  IST  )

ప్రపంచంలోనే అతి పెద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Mahakumbha Mela)లో విశేషాలకు కొదువలేదు. ఎన్నో ప్రత్యేకమైన విశేషాలతో పాటు వింతైన అంశాలకు కూడా మహాకుంభమేళా వేదికగా నిలుస్తుంది.

Mahakumbha Mela : మహాకుంభ మేళాతో ఖర్చు లేని సంపాదన!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అతి పెద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Mahakumbha Mela)లో విశేషాలకు కొదువలేదు. ఎన్నో ప్రత్యేకమైన విశేషాలతో పాటు వింతైన అంశాలకు కూడా మహాకుంభమేళా వేదికగా నిలుస్తుంది. పూసల దండలు అమ్ముకునే సాధారణ యువతిని మహాకుంభ మేళా మోనాలిసాగా ప్రపంచం ముందు నిలబెట్టడంతో పాటు హీరోయిన్ గా కూడా మార్చేసింది. ఇలాంటి వింతలు..విశేషాలు మహాకుంభమేళాలో ఎన్నో వెలుగు చూస్తున్నాయి. 144ఏండ్లకు ఒకసారి అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి మాత్రమే సందర్శించే అవకాశమున్న మహాకుంభమేళాకు సాధువులు, సంతులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు హాజరవుతున్నారు. ఇక కోట్లలో వస్తున్న భక్తులతో ప్రయాగ్‌రాజ్‌ వ్యాపారుల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. కోట్లాది మంది వ‌చ్చే మహా కుంభమేళాలో కాదేదీ వ్యాపారానికి అన‌ర్హం అన్నట్లుగా మారిపోయింది.

భక్తులు తమ నమ్మకాల మేరకు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా గంగా మాతకు ప్రత్యేక పూజలతో పాటు నదిలో నాణాలు(Coins in the river) వేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇది కాస్తా కొంత మందికి ఆదాయ మార్గంగా మారింది. భక్తులు నదిలో వేసే నాణాల సేకరణ పనిగా పెట్టుకున్న కొంత మంది ఎలాంటి ఖర్చు లేకుండా నిత్యం వేలల్లో ఆదాయం సంపాదిస్తుండం(Income from coin collection)చర్చనీయాంశమైంది. ఆయస్కాంతాలతో నాణాలు బయటకు తీస్తున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాణాల సేకరణతో నిత్యం గరిష్టంగా ఒక్కొక్కరు 4వేల వరకు సంపాదిస్తున్నట్లుగా యువకులు తెలిపారు.

ఇలాగే మరో యువకుడు తన ప్రేయసి ఇచ్చిన ఐడియాతో కుంభమేళాకి వ‌స్తున్న భ‌క్తుల‌కు వేప పుల్లలు అమ్ముతూ వారం రోజుల్లో ఏకంగా రూ. 40వేలు సంపాదించినట్లుగా చెప్పిన వీడియో వైరల్ గా మారింది రూపాయి పెట్టుబ‌డి లేకుండా నది తీరంలో భక్తుల మధ్య ఎంత దూరం న‌డిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటుంద‌ని అత‌డు చెప్పుకొచ్చాడు.

ఇక నదిలో నాణేలు విసరడం విషయానికొస్తే దీనివెనుక భక్తుల నమ్మకంతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉంది. పురాతన కాలంతో నాణాలను రాగితో తయారు చేసే వారు. రాగి నాణాలను నీటిలో వేస్తే, అది నీటిలోని మురికిని(dirty) తొలగిస్తుందని నమ్మేవారు. అంటే రాగి ధాతువు నీటిని శుద్ధి చేస్తుందని భావించేవారు. నదులలోని నీటిని పరిశుభ్రం(cleanliness)గా ఉంచేందుకు నాటి రోజల్లో రాగి నాణేలను నదుల్లో విసిరేవారని చెబుతుంటారు. నాటి రోజుల్లోని నమ్మకం కారణంగా నేటికీ ప్రజలు దీనినే అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉక్కు నాణేలు వాడుకలో ఉన్నాయి. వీటిని నీటిలో వేయడం వలన ప్రయోజనం(purpose) లేదంటున్నారు నిపుణులు.

ఇక ఈ నెల 13న ప్రారంభ‌మైన ఈ కుంభ‌మేళా ఫిబ్రవ‌రి 26 వ‌ర‌కు 45రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. సుమారు 40కోట్ల మంది వ‌ర‌కు భ‌క్తులు త‌ర‌లి వ‌స్తార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మహాకుంభమేళాలో భక్తుల ద్వారా జరిగే లావాదేవిలతో రూ.2లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. బస్సులు, రైళ్లు, విమాన టికెట్లు, లోకల్ రవాణా, హోటళ్లు, గెస్ట్ హౌస్లు, అద్దె గదులు, ఆహారం, ప్యాకేజీ ఫుడ్, నీరు, బిస్కట్లు, పండ్ల రసాలు వంటివి., ఆరోగ్య సంరక్షణలు, పూజా సామాగ్రి నూనె, దీపాలు, దేవతా బొమ్మలు ఇలా రకరకాల వ్యాపార మార్గాల్లో జరిగే వ్యాపారాలతో ఎందరికో ఆదాయం..మరెందరికో జీవనోపాధి లభిస్తుండటం మహాకుంభమేళ విశేషాల్లో ఒకటిగా కూడా చెప్పుకోవచ్చు.

Next Story